ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @1 PM

ప్రధాన వార్తలు @1 PM

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @1 PM

By

Published : Jun 1, 2021, 1:01 PM IST

  • విచారణ వాయిదా
    అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ సీబీఐ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తయారీకి ముమ్మర ఏర్పాట్లు!
    కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వాధికారుల సూచనతో... ఆనందయ్య బృందం ఔషధం తయారీకి సన్నాహాలు చేస్తోంది. వికేంద్రీకరణ పద్ధతి, ఆన్‌లైన్ ద్వారా నాలుగైదు రోజుల్లో ఔషధ పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'విధ్వంస పాలనే జగన్‌ ప్రధాన ధ్యేయం'
    వైకాపా రెండేళ్ల పాలనపై సీఎం జగన్ విడుదల చేసిన పుస్తకమంతా అసత్యాలేనని... శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. వైకాపా పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ ఆగిపోయాయని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు, విధ్వంస పాలనే జగన్‌ ప్రధాన ధ్యేయమని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కేంద్ర మంత్రికి అస్వస్థత
    కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ నిశాంక్​.. దిల్లీ ఎయిమ్స్​లో చేరారు. కొవిడ్​ తదనంతర సమస్యలతోనే వెళ్లినట్లు వైద్యులు వెల్లడించారు. 11.30 గంటలకు కేంద్ర మంత్రి ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తుపాకీతో మండపంపైకి
    ఉత్తర్​ప్రదేశ్ ప్రతాప్​గఢ్ జిల్లాలో జరిగిన ఓ వివాహం నెట్టింట వైరల్​గా మారింది. వధువు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపింది. ఆ తర్వాత వరుడి చేయి పట్టుకుని ఎంతో ఉత్సాహంతో పెళ్లి మండపంపైకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నగ్నంగా కొవిడ్ రోగులు
    ఒడిశా మయూర్​భంజ్​లోని కిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా బాధితులు ఒంటిపై వస్త్రాలు లేకుండానే నేలమీద పడుకొని ఉన్న వీడియోలు వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చైనా బ్లాగర్​కు 8 నెలల జైలు శిక్ష
    గల్వాన్ ఘటనలో చైనా సైనికుల మరణంపై సందేహం వ్యక్తం చేసిన బ్లాగర్​కు చైనా కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. పది రోజుల్లోగా జాతీయ మీడియాతో పాటు ప్రధాన సామాజిక మాధ్యమాల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టోక్యోలో ఆస్ట్రేలియా జట్టు
    ఒలింపిక్స్ కోసం టోక్యోకు చేరుకుంది ఆస్ట్రేలియా సాఫ్ట్‌బాల్ జట్టు. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితుల నేపథ్యంలో జపాన్​లో అడుగుపెట్టిన తొలి విదేశీ టీమ్​గా నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఫస్ట్​లుక్ విడుదల
    యువ నటుడు నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం '18 పేజెస్' (18 pages first Look). పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్ విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details