ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @1PM

.

1pm Top news
ప్రధాన వార్తలు @1PM

By

Published : Jan 14, 2022, 1:01 PM IST

  • తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న జగన్​
    తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. తాడేపల్లిలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో సీఎం జగన్​ దంపతులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పండగలు శక్తిమంతమైన సాంస్కృతిక వైవిధ్యానికి సూచిక'
    మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్​, పొంగల్​ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పండుగలు శక్తిమంతమైన సాంస్కృతిక వైవిధ్యానికి సూచిక అని ప్రధాని ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కర్రలతో కొట్టి వ్యక్తి దారుణ హత్య.. కారణమేంటంటే..
    పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడులో దారుణం చోటు చేసుకుంది. సారా తయారీ విక్రయాలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నాడనే నెపంతో ఇద్దరు వ్యక్తులు ఒకరిని అత్యంత దారుణంగా కొట్టి చంపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కాంగ్రెస్​ తొలి జాబితా సిద్ధం.. రెండు స్థానాల్లో సీఎం పోటీ!
    పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 70 మందికిపైగా అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్​ సిద్ధం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి ముఖ్యమంత్రి చరణ్​ జీత్​ సింగ్​ చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రోడ్డు డివైడర్​ను ఢీకొన్న కారు- ఏడుగురు మృతి
    కర్ణాటక దావణగెరెలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు రోడ్డు డివైడర్​ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కరోనా విలయం- ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు దాటిన కేసులు
    ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 32కోట్లు దాటింది. ఇప్పటివరకు ఈ వైరస్ ధాటికి మరణించిన వారి సంఖ్య 55లక్షల 39వేలకు చేరింది. అమెరికా, ఫ్రాన్స్​లో వైరస్​ ఉద్ధృతి ఆందోళనకర స్థాయిలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • డీమ్యాట్‌ ఖాతా నామినీ పేరు రాశారా?
    స్టాక్‌ మార్కెట్లు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తుండటంతో ఎంతోమంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దశాబ్దాల క్రితం డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు తీసుకోవడం పెద్ద ప్రహసనంగా ఉండేది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ క్షణాల్లోనే ఈ ఖాతాలు తీసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బైక్​కు బీమా చేయించే ముందు ఇవి తెలుసుకోండి..
    ఆధునిక జీవితంలో బైక్​ ప్రాధాన్యం పెరిగింది. ప్రతి ఇంట్లో ఒకటి అంతకన్నా ఎక్కువ ద్విచక్ర వాహనాలు ఉంటున్నాయి. మన జీవితాల్లో వాటికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి బండికి బీమా తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే.. ఆ బీమా చేయించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పంత్​పై ప్రశంసలు.. మరి వాళ్ల పరిస్థితేంటి?
    పంత్‌ ఏంటి? ఇలా ఆడుతున్నాడు.. జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఎవరైనా అలా ఔటవుతారా?.. ఇవీ దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకోవడం వల్ల వెల్లువెత్తిన విమర్శలు! పంత్‌లా పోరాట పటిమ చూపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రవితేజ 'రావణాసుర' షురూ.. క్లాప్​ కొట్టిన మెగాస్టార్
    మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా, రవితేజ కొత్త సినిమా పూజా కార్యక్రమం జరిగింది. 'రావణాసుర' టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details