తెలంగాణలో కొత్తగా 197 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,93,253కు చేరింది. ఈ మహమ్మారితో ఒకరు మృతి చెందారు. కరోనాతో ఇప్పటివరకు 1,589 మంది మరణించారు.
కరోనా నుంచి తాజాగా 376 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,88,275 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 3,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 1,842 మంది బాధితులు ఉన్నారు. తాజాగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 32 కేసులు నమోదయ్యాయి.