తెలంగాణలో మరో 14 వందల 51 మందికి కరోనా నిర్ధరణ అయింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 20 వేల 675కు చేరింది. మహమ్మారితో ఇప్పటివరకు 12 వందల 65 మంది బలయ్యారు. మరో 19 వందల 83 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా.... మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య లక్షా 96 వేల 636కు చేరింది.
తెలంగాణలో 2 లక్షల 20వేలు దాటిన కరోనా కేసులు - Telangana Corona Cases
తెలంగాణలో కొత్తగా 14 వందల 51 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. వైరస్‌తో ఇప్పటివరకు 12 వందల 65 మంది చనిపోయారు.
తెలంగాణలో 2 లక్షల 20వేలు దాటిన కరోనా కేసులు
రాష్ట్రంలో ప్రస్తుతం 22 వేల 774 యాక్టివ్ కేసులుండగా... 18 వేల 905 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 235 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 104, మేడ్చల్ జిల్లాలో 101 కరోనా కేసులు వచ్చాయి.