- కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 19వేల కేసులు.. అమెరికాలో లక్షకు పైగా..
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య 19,893 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 4.94శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 20,419 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.31శాతంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైకాపా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు
ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమం అశ్లీల నృత్యాలకు వేదికయింది. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యువతులతో అశ్లీలంగా నృత్యాలు చేయించడంతో పాటు కొందరు వైకాపా కార్యకర్తలు వారితో కలిసి నృత్యాలు చేశారు. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ తతంగం సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ పోస్టు ఎవరు పెట్టమన్నారు ?'.. తెలుగుయువత నాయకుడిని విచారించిన సీఐడీ
సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ పథకాన్ని ఉద్దేశించి పోస్టు పెట్టాడనే ఆరోపణలతో తెలుగు యువత సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ చీరాల సునీల్‌ను బుధవారం గుంటూరు సీఐడీ పోలీసులు విచారించారు. అనంతరం తాము పిలిచినప్పుడు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని వ్యక్తిగత పూచీకత్తుపై 41 నోటీసు ఇచ్చి పంపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బురదలో కొట్టుకుపోయిన.. ప్రకృతి అందాలు..!
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని యడవల్లి- బోళ్లపల్లి గ్రామాల మధ్య నెల కిందటి వరకూ కనువిందు చేసిన ప్రకృతి అందాలపై ఇప్పుడు బురద పేరుకుపోయింది. ఇటీవల వచ్చిన గోదావరి వరద అక్కడున్న ఎద్దు వాగుకు పోటెత్తింది. పచ్చికబయళ్లు 20 రోజుల పాటు గోదావరి నీరు, బురదలో మునిగాయి. వరద తగ్గాక అడుగు మేర మట్టి మేట వేసి..బురదమయం అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భుజంపై కుమారుడి మృతదేహం.. కిలోమీటర్ల పాటు నడక.. ఆర్మీ సాయంతో..
కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ఓ తండ్రి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబులెన్సు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సిబ్బందికి విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో భుజాలపైనే కుమారుడి మృతదేహాన్ని మోసుకెళ్లారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తైవాన్ను వీడిన పెలోసీ.. అమెరికాను వదిలే ప్రసక్తే లేదన్న చైనా