- బలహీనపడిన 'అసని' తీవ్ర తుపాను.. రేపు ఉదయానికి వాయుగుండం
Asani Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాను 'అసని'.. తుపానుగా బలహీనపడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కి.మీ., కాకినాడకు 150 కి.మీ, విశాఖకు 310 కి.మీ, గోపాలపూర్‌కు 530 కి.మీ, పూరీకి 640 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CBN TOUR: నేటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన
CBN TOUR: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. బోయనపల్లిలో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో పాల్గొంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై స్తంభించిన రాకపోకలు.. వాహనాల దారి మళ్లింపు
TRAFFIC: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. కళ్యాణి డ్యాం వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో... ఆర్టీసీ బస్సును రోడ్డు పక్కకు తొలగించగా.. లారీని మాత్రం రోడ్డుపైనే ఉంచారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాకాల, దామలచెరువు, కల్లూరు మీదగా పీలేరు, మదనపల్లికి దారి మళ్లించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Conistable: 'గోడే కదా పగలగొట్టింది.. ప్రాణాలేవీ పోలేదు కదా'.. బాధితులతో సెంట్రీ కానిస్టేబుల్
Conistable: ఏదో పడగొడుతున్నట్లుగా పెద్ద శబ్ధాలు రావడంతో ఆ ప్రాంతంలోని పిల్లి చంద్రశేఖర్ దంపతులు ఉలిక్కిపడి లేచారు. బయటకి వచ్చి చూడగా, వారి ఇంటి గోడను గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పగలగొడుతున్నారు. దీంతో వారు భయంతో ‘మాకు ప్రాణాహాని ఉంది. ప్రమాదంలో ఉన్నాం. మమ్మల్ని రక్షించండం’టూ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురు స్నేహితులు దుర్మరణం
Road accident in Maharashtra: కారు అదుపుతప్పి చెట్టిన ఢీకొట్టగా నలుగురు స్నేహితులు దుర్మరణం చెందిన దుర్ఘటన మహారాష్ట్రలోని మన్మాడ్ నగరంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నిప్పులపై నడుస్తూ పడిపోయిన పూజారి.. మంటలు చెలరేగి...
Fire walking ceremony: కర్ణాటక రామనగర జిల్లా హరూర్ గ్రామంలో నిర్వహించిన ఉత్సవాల్లో అపశ్రుతి దొర్లింది. నిప్పులపై నడిచే కార్యక్రమంలో ఓ పూజారి తీవ్రంగా గాయపడ్డారు. నదీశ్ అనే పూజారి.. దైవాన్ని తలుచుకుంటూ ఊగిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- షాంఘైలో కరోనా విలయం.. సబ్‌వేలు బంద్ .. నిర్బంధంలోనే 2.5 కోట్ల మంది
కరోనా వ్యాప్తితో చైనా అతలాకుతలమవుతోంది. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా సోకిన ప్రదేశాల్లోని ప్రజలను ఎక్కడికక్కడే నిర్బంధిస్తున్నారు అధికారులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Rate Today: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IPL 2022: రషీద్, గిల్ అరుదైన రికార్డు.. సచిన్, బ్రావో సరసన చోటు
IPL 2022 Rashid khan record: లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి.. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. మరోవైపు శుభమన్ గిల్ కూడా ఓ ఘనత సాధించాడు. అదేంటంటే... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చరిత్ర సృష్టించిన హీరోయిన్ ఫొటో.. వేలంలో రూ.1500కోట్లు
Marilyn Monore: హాలీవుడ్ ఎవర్గ్రీన్ బ్యూటీ.. ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో.. సినీప్రియులకు పరిచయం లేని పేరు. చిన్న వయసులోనే ఎనలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈమె అందం చూస్తే ఇప్పటికే కుర్రాళ్ల గుండెళ్లో సెగలే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 11 AM