- కొవిడ్ ఉత్పరివర్తనాల గుర్తింపునకు గుంటూరులో ప్రయోగశాల
గుంటూరు వైద్య కళాశాలలో కొవిడ్ ఉత్పరివర్తనాల గుర్తింపు కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చులు చేయనున్నారు. ఈ ప్రయోగశాల వల్ల వైరస్‌లో కొత్త రకాలను సులువుగా గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పవన్ కల్యాణ్‌ను అభినందించిన తెలంగాణ గవర్నర్
సినీనటుడు పవన్ కల్యాణ్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు రెండు లక్షలు సహాయం చేసి ఆదుకోవడం హర్షణీయమని ఆమె ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అక్కడ ధరలు పెరిగితే.. ఇక్కడున్న అన్నదాతపై అదనపు భారం!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరకుల ధరలు పెరగడంతో... దేశీయ రైతులపై అదనంగా 30 శాతం భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాయితీ భరించకుంటే... ఎరువుల ధరలు మరింత పెరిగే ప్రమాదముందని నిపుణులు సూచిస్తున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాష్ట్రంలో తగ్గిన విద్యుదుత్పత్తి.. సర్దుబాటుకు ఇబ్బందులు
రాష్ట్రంలో విద్యుదుత్పత్తి ఒక్కసారిగా తగ్గిపోయింది. జెన్‌కో నుంచి 57 ఎంయూలే విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంటోంది. డిమాండ్ సర్దుబాటు కోసం రోజూ 25 ఎంయూల విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దేశంలో కొత్తగా 38వేల కేసులు, 43వేల రికవరీలు
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 38,948 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 219 మంది మరణించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'పాంచజన్య ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి కాదు'
ఆదాయపన్ను శాఖ రూపొందించిన పోర్టల్‌లో సాంకేతిక లోపాలను ప్రస్తావిస్తు ప్రచురించిన కథనంపై ఆర్ఎస్ఎస్ వెనక్కి తగ్గింది. ఈ కథనం అనేది కేవలం రచయిత భావాన్ని వ్యక్తపరుస్తుందని ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచారకర్త సునీల్ అంబేకర్ తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వాతావరణ మార్పులపై పుస్తకం.. 10 ఏళ్ల బాలుడి ఘనత
చిన్న వయసులోనే పర్యావరణ ప్రాముఖ్యతను(climate change) తెలుసుకున్న ఓ బడతడు.. ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు. 10 ఏళ్లకే ఏకంగా పుస్తకమే రాశాడు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో(india book of records) చోటు సంపాదించాడు. అతడే.. నాలుగో తరగతి చదువుతున్న శిరీష్.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గర్భంతో ఉన్న మహిళా పోలీస్ దారుణ హత్య- తాలిబన్ల పనే!
అఫ్గాన్‌లో నిండు గర్భిణి అయిన మహిళా పోలీస్‌ను తాలిబన్లు కాల్చి చంపారని బీబీసీ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే.. ఈ హత్యపై తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గోడను బాది, హెల్మెట్ విసిరి కోహ్లీ ఫ్రస్ట్రేషన్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా సారథి కోహ్లీ((kohli england tour 2021)అసహనానికి గురయ్యాడు. బలంగా గోడను బాదుతూ హెల్మెట్‌ను పక్కకు విసిరాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పవన్-హరీశ్ సినిమా టైటిల్ ఇదేనా?
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పపర్స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రానికి ఓ స్వాతంత్య్ర సమరయోధుడి పేరును (pawan kalyan new movie title) పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదేంటంటే? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి