ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11AM

..

By

Published : Sep 16, 2020, 11:00 AM IST

TOP NEWS
ప్రధాన వార్తలు

  • కరోనా భయాలు- సాంత్వనకు మార్గాలు

కరోనా మహమ్మారి ప్రపంచంపై ప్రభావం చూపినప్పటి నుంచి ప్రతీఒక్కరిలో భయాలు మొదలయ్యాయి. కరోనా సోకుతుందేమోనని తీవ్ర ఆందోళనలతో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ భయాలతోనే జీవించాలా? భయాలు వీడి ధైర్యంగా ఉండటానికి ఉన్న మార్గాలేంటి?... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెండింగ్​లో.. 4 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ!

రెండేళ్లు కావస్తున్నా ఏపీలో డీఎస్సీ-2018 ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంతవరకూ అన్ని పోస్టులనూ భర్తీ చేయని కారణంగా.. కొత్త డీఎస్సీ ప్రకటన నిలిచిపోయింది. విద్యార్థుల సంఖ్య పెరిగితే... బోధన కష్టమే అన్న వాదనలు విపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సాక్షి పత్రికకు ప్రకటనలు నిలిపేయాలి: వర్ల రామయ్య

దళిత వర్గాలపై దాడులు జరుగుతుంటే.. సాక్షి పత్రిక పట్టించుకోవడం లేదని.. తెదేపా నేత వర్ల రామయ్య సీఎం జగన్​కు బహిరంగ లేఖ రాశారు. ఆ పత్రికకు ప్రకటనలను నిలిపేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విచారణ కోసం పిలిస్తే... 108 వాహనానికి నిప్పంటించాడు!

విచారణ కోసం పిలిచిన ఓ మాజీ రౌడీషీటర్ 108 వాహనానికి నిప్పుంటించిన ఘటన ఒంగోలు జిల్లాలో జరిగింది.ఈ ఘటనలో వాహనం పై భాగం పూర్తిగా కాలిపోయింది. నిందితుడిని రిమ్స్ కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో అరకోటి దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 90,123 మందికి వైరస్​ సోకింది. మరో 1,290 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య అరకోటిని అధిగమించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రపంచంలో పొడవైన రహదారి టన్నెల్ ప్రారంభానికి సిద్ధం

ప్రపంచంలోనే పొడవైన రహదారి టన్నెల్ ప్రారంభానికి సిద్ధమైంది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ రహదారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆవిష్కరించనున్నారు. ఈ రహదారి టన్నెల్​లో ప్రతీ 60 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేపాల్​లో భూకంపం-బిహార్​లోనూ ప్రకంపనలు

సరిహద్దు దేశం నేపాల్​లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 6 తీవ్రత నమోదైంది. ఉత్తర భారతంపైనా భూకంపం స్వల్ప ప్రభావం చూపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'భారత్​లో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడతాం'

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా... దేశంలో రానున్న 12 నెలల్లో రూ.2000కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ వైస్​ ఛైర్మన్​ విక్రమ్​ కిర్లోస్కర్​ తెలిపారు. ఈ క్రమంలో అధిక పన్నుల కారణంగా భారత్‌లో విస్తరించబోమని కంపెనీ సీనియర్‌ అధికారి ప్రకటనను ఖండించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ధోనీ, రోహిత్​లతో పోలిస్తే కోహ్లీ వెనుకబడ్డాడు​'

ఐపీఎల్​లో బెంగళూరు జట్టును గెలిపించడమే కెప్టెన్​ కోహ్లీ లక్ష్యమని మాజీ క్రికెటర్​ గౌతమ్ గంభీర్ అన్నాడు​. బ్యాటింగ్​లో రాణిస్తున్నా సరే ధోనీ, రోహిత్​లతో పోల్చుకుంటే​ ట్రోఫీలు గెలవడంలో విరాట్ వెనుకపడ్డాడని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'రియాను మీడియా తప్పుగా చిత్రీకరిస్తోంది'

నటుడు సుశాంత్​ రాజ్​పుత్ ఆత్మహత్య కేసులో నటి రియా చక్రవర్తిని మీడియా తప్పుగా చిత్రీకరిస్తోందని​ బాలీవుడ్​కు చెందిన 2500మంది ఓ లేఖను విడుదల చేశారు. వీరిలో సోనమ్‌ కపూర్‌, జోయా అక్తర్‌, గౌరీ షిండే, అనురాగ్‌ కశ్యప్‌, అదితి మిట్టల్‌ ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details