ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా కేసులు నమోదు - కొవిడ్-19 తాజా వార్తలు

రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య.. 8,87,989కి చేరింది.

118 new corona positive cases registered in the state
రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా కేసులు నమోదు

By

Published : Mar 9, 2021, 5:24 PM IST

రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 45,079 నమూనాలను పరీక్షించగా తాజాగా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,87,989కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24గంటల్లో కరోనాతో ఒక్కరు కుడా మరణించలేదు. 24 గంటల్లో 89 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,038 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,43,07,165 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details