ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి మాక్సిమ్ స్టెపనోవ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ హైదరాబాద్‌లో జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కేంద్రాన్ని సందర్శించింది. ఈ కమిటీలో ఆ దేశ ఆర్థిక మంత్రి, డిప్యూటీ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. ఉక్రెయిన్‌కు కొవాగ్జిన్ సరఫరా గురించి భారత్ బయోటెక్ యాజమాన్యంతో చర్చించారు. ప్రాధాన్యత క్రమంలో కొవాగ్జిన్‌ను ఉక్రెయిన్‌కు సరఫరా చేసేందుకు టైమ్ లైన్‌తో పాటు ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌కు సంబంధించిన ఒప్పందంపై చర్చించినట్లు భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు.
భారత్ బయోటెక్‌ను సందర్శించిన ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి
ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ భారత్ బయోటెక్ కేంద్రాన్ని సందర్శించింది. ఉక్రెయిన్‌కు కొవాగ్జిన్ సరఫరా గురించి భారత్ బయోటెక్ యాజమాన్యంతో కమిటీ సభ్యులు చర్చించారు. కొవాగ్జిన్‌ను మాస్ వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించనున్నట్లు ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారని భారత్ బయోటెక్ ప్రకటించింది.
భారత్ బయోటెక్‌ను సందర్శించిన ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి
భారత్, ఉక్రెయిన్ మధ్య సహాయ సహకారాలు, దౌత్య సంబంధాలకు చాలా చరిత్ర ఉందని... టీకా తయారీలో భారత్‌కు ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటామని ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి మాక్సిమ్ స్టెపనోవ్ వ్యాఖ్యానించారని భారత్ బయోటెక్ పేర్కొంది. కొవాగ్జిన్‌ను మాస్ వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారని ప్రకటించింది.
ఇదీ చదవండి: పోలవరంలో అదనపు భద్రతా చర్యల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు