దేశీయంగా రూపొందిన దీర్ఘశ్రేణి ఆర్టిలరీ గన్లను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయాలంటూ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్బీ)కు రక్షణ శాఖ ఆర్డరు జారీ చేసింది. 155 మిల్లీమీటర్ల 45 క్యాలిబర్ గల 114 ధనుష్ ఆర్టిలరీ గన్లను సైన్యానికి త్వరితగతిన అందించాలనిఆదేశించింది.
మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఓఎఫ్బీకి ఆర్డరు లభించింది.
ధనుష్ ప్రత్యేకతలు
అంతర్గత నావిగేషన్ సైటింగ్, లక్ష్యాలకు అనుగుణంగా దిశను మార్చుకునే వ్యవస్థ, బాలిస్టిక్ కంప్యుటేషన్ వ్యవస్థ, పగలుతో పాటు రాత్రి కూడా సమర్థంగా లక్ష్యాలను ఛేదించటం.
సుదూర లక్ష్య ఛేదన సామర్థ్యంగల ధనుష్ గన్లను రక్షణ దళాల వినియోగానికి ఉత్పత్తి చేయటం ఇదే తొలిసారని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తెలిపింది.
దేశీయంగా రూపకల్పన చేసిన భారీ ఆర్టిలరీ గన్ ధనుష్ తయారీలో డీఆర్డీఓతో పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సెయిల్ సహకారం అందించాయని ఆర్డినెన్సు ఫ్యాక్టరీ బోర్డు స్పష్టం చేసింది.