ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు: కన్నా - modi
దేశ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. భాజపా విజయం సాధించడం పట్ల విజయవాడ భాజపా కార్యాలయంలో జరిగిన సంబరాలకు ఆయన హాజరయ్యారు.
కన్నా లక్ష్మీనారాయణ
దేశవ్యాప్తంగా భాజపా విజయఢంకా మోగించడంపై విజయవాడ భాజపా కార్యాలయంలో పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుపరిపాలన అందించిన మోదీ మరోసారి ప్రధాని కావాలని ప్రజలు దీవించారన్నారు. స్పష్టమైన మెజారిటీతో మోదీకి పట్టంకట్టారని అభిప్రాయపడ్డారు.