ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జాతీయస్థాయిలో మెరిసిన చిన్నారి శ్రావణి - national champion

ప్రతిభకు పేదరికం అడ్డురాదని... సాధించాలనే తపన ఉంటే అసాధ్యమైన సుసాధ్యమే అని నిరూపించిందో చిన్నారి. పుట్టి పెరిగింది పల్లెటూరిలోనైనా... అవరోధాల్ని అవకాశాలుగా మార్చుకుని కష్టతరమైన యోగాసనాలను సునాయసంగా వేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం పెద్ద ఉయ్యాలవాడ చెందిన శ్రావణి జాతీయస్థాయి యోగా పోటీల్లో మూడోస్థానం సాధించి తోటి బాలికలకు ఆదర్శంగా నిలిచింది.

జాతీయస్థాయిలో మెరిసిన చిన్నారి శ్రావణి

By

Published : Apr 21, 2019, 8:05 AM IST

జాతీయస్థాయిలో మెరిసిన చిన్నారి శ్రావణి

తాళ్లూరు కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శ్రావణికి క్రీడలపై ఆసక్తి ఎక్కువ. ఈ విషయాన్ని గమనించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మీ.. శ్రావణికి యోగా శిక్షణ ఇచ్చి మెళకువలు నేర్పారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో మెరుగైన ప్రదర్శనలు ఇచ్చిన ఈ బాలిక జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.

జాతీయ స్థాయిలో గెలుపు

ఈ నెల 9 నుంచి మూడ్రోజులపాటు మధ్యప్రదేశ్ ఇండోర్​లో జరిగిన యోగా పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొని తృతీయస్థానం సాధించింది. మారుమూల గ్రామం నుంచి జాతీయస్థాయి వరకూ ఎదిగిన ఈ చిన్నారి మరిన్నీ విజయాలు సాధించాలని తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది కోరుకుంటున్నారు.

వ్యాయామ ఉపాధ్యాయురాలు శిక్షణ

సదుపాయాలు అంతతం మాత్రమే ఉన్న పాఠశాలలో విద్యార్థులకు యోగా పట్ల ఆసక్తి గమనించి అందులో శిక్షణ ఇస్తున్నారు యోగా ఉపాధ్యాయురాలు లక్ష్మి. కఠినమైన యోగాసనాలను సులభంగా వేసేలా బాలికలకు మెళకువలు నేర్పుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details