కృష్ణా జిల్లా రాజధాని ప్రాంతంలోని కొండపల్లి కోటయ్య నగర్‌కు కృష్ణా నది నుంచి నీరు సరఫరా అవుతున్నాయి. తగినంత నీరు వస్తున్నా...అధిక నీటి కోసం కాలనీ వాసులు విద్యుత్ మోటర్లను అమర్చుకున్నారు. మోటర్ల ద్వారా అధిక నీటిని తొడుకుంటూ వృథా చేస్తున్నారు. చాలా నీరు సైడ్ కాలువల్లో వృథాగా పోతున్న దృశ్యాలు తరచూ తారసపడుతున్నాయి. మోటర్ల ద్వారా నీరు తోడడం వలన పరిసర కాలనీలకు నీరు అందని పరిస్థితులు తలెత్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.
నీటి వృథాకు అడ్డుకట్ట పడేనా..!
రాష్ట్రంలోని పలు జిల్లాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. తాగు నీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరం ప్రయాణిస్తున్నారు. గుక్కెడు నీటి కోసం కటకటలాడుతున్న పరిస్థితులు ఒక పక్క ఉంటే..అందుబాటులో ఉన్న నీటిని వృథా చేస్తున్న ఘటనలు మరో పక్క కన్పిస్తున్నాయి.
నీటి వృథాకు అడ్డుకట్ట పడేనా!