కర్నూలు జిల్లా నంద్యాలలో విత్తన శుద్ధి కేంద్రాల్లో విజిలెన్స్ అధికారుల బృందం శనివారంనాడు దాడులు జరిపారు. శ్రీ మహాలక్ష్మీ అగ్రో సీడ్స్తో మరో నాలుగు విత్తన శుద్ధి కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. పలు అవకతవకలను గుర్తించారు. అస్తవస్తంగా దస్త్రాల నిర్వహణ, నిల్వచేసిన విత్తన వివరాల నివేదికను వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వకపోవడం తదితర వాటిని గుర్తించారు. విత్తన చట్టానికి విరుద్ధంగా శుద్ధి కేంద్రాల యజమానులు వ్యవహరించినట్లు విజిలెన్స్ అధికారులు భావించారు. ఈ క్రమంలో రూ.2.20 కోట్ల విలువ చేసే పలురకాల వరి విత్తనాల అమ్మకాలను నిలిపివేశారు. అన్ని ఆధారాలు చూపిన తర్వాత అమ్మకాలకు అనుమతి ఉంటుందని విజిలెన్స్ అధికారి తెలిపారు.
విత్తన శుద్ధి కేంద్రాలపై విజిలెన్స్ దాడులు - nandyal
విత్తన శుద్ధి కేంద్రాల్లో విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. విత్తన చట్టానికి విరుద్ధంగా శుద్ధి కేంద్రాల యజమానులు వ్యవహరించినట్లు అధికారులు భావించారు. పలురకాల వరి విత్తనాల అమ్మకాలని నిలిపివేశారు. ఆధారాలు చూపిన తదుపరి అమ్మకాలకు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
విత్తన శుద్ధి కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు