అక్షయ తృతీయ సందర్భంగా బంగారు దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తుకాల్లో తేడా ఉంటే కేసులు నమోదు చేస్తామని అధికారులు అన్నారు. ఈ శాఖ డైరక్టర్ దామోదర్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంస్థల అమలులో ఉన్న బంగారం డిపాజిట్ స్కీంలపై ఆరా తీసినట్లు తెలిపారు. బంగారం కొనేముందు వినియోగదారులు జాగ్రత్త వహించాలన్న అధికారులు...వెయింగ్ మిషన్లలో తేడాలను గమనించాలన్నారు. ఆభరణాల్లో వాడే రాళ్లకు, బంగారానికి వేరుగా బిల్లు చేస్తున్నారా...అనే విషయం పరిశీలించామని అధికారులు తెలిపారు. బంగారం కొనేటప్పుడు వినియోగదారులు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలని కోరారు.
ప్రముఖ నగల దుకాణాల్లో సోదాలు... తూకాల్లో తేడాల పరిశీలన - kalyan
రాష్ట్రంలోని ప్రముఖ బంగారం దుకాణాలపై తునికలు, కొలతల శాఖ తనిఖీలు చేపట్టింది. కర్నూలు నగరంలోని ఖజానా, కల్యాణ్, తనిష్క్ నగల షోరూంలపై అధికారులు దాడులు చేశారు. నగల నాణ్యత, తూకాల్లో తేడాలను పరిశీలించారు. కొలతల మిషన్లు సరిగా ఉన్నాయా ? లేదా ? పరిక్షించినట్లు అధికారులు తెలిపారు.
ప్రముఖ నగల దుకాణాల్లో సోదాలు...తూకాల్లో తేడాలు పరిశీలన