ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కర్ణాటక కుట్ర వెనుక మోదీ, షా: కాంగ్రెస్​

కర్ణాటక ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా అగ్ర నాయకులు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్​ పార్టీ ఆరోపించింది.

కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు రణ్​దీప్​ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్​ తీవ్ర విమర్శలు

By

Published : Feb 9, 2019, 2:52 PM IST

భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు రణ్​దీప్​ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్​ తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో జేడీఎస్​-కాంగ్రెస్​ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు జరుగుతున్న కుట్ర వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధినేత అమిత్​ షా హస్తం ఉందని ఆరోపించారు. పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ప్రకటించారు.

న్యాయాధికారులను అమిత్​ షా ఎలాగైనా తనవైపు తిప్పుకుంటారని ఆడియో క్లిప్​లో యడ్యూరప్ప అన్న విషయాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్​ నేతలు. ఆడియో క్లిప్​ని సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​ని కోరారు.

జేడీఎస్​ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు ఇస్తానని భాజపా రాష్ట్ర అధినేత యడ్యూరప్ప అన్న వ్యాఖ్యల ఆడియో క్లిప్​ను ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

" సీబీఐ, ఈడీ యడ్యూరప్పపై విచారణ చేస్తాయా? ఒకవేళ అది జరగలేదంటే కర్ణాటక ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రల వెనుక నరేంద్ర మోదీ, అమిత్​ షా ఉన్నారని స్పష్టమవుతుంది"

- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం అస్థిరపరుస్తోందని ఆరోపించారు వేణుగోపాల్​. కర్ణాటకకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలను, స్పీకర్​ను తమవైపునకు తిప్పుకునేందుకు భాజపా రూ.450 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైందని, ఈ మొత్తం ఎలా వచ్చిందో ప్రధాని సమాధానమివ్వాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details