సుందరంగా అలంకరించిన వసంతమండపంలో స్వామి అమ్మవార్ల ప్రతిమలకు అభిషేకం, స్నపనతిరుమంజనం చేశారు అర్చకులు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వసంతోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవార్లు స్వర్ణరథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బంగారు రథోత్సవంలో విహరించిన మలయప్పస్వామికి భక్తులు భక్తి శ్రద్ధలతో కర్పూరహారతులు, నైవేద్యాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.
కళియుగ దైవాన్నీ కనులారా వీక్షించ రారండి!
శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవరోజున ఇవాళ ఉభయదేవేరుల సమేత మలయప్పస్వామి తీరువీధుల్లో ఊరేగుతూ వసంతమండపానికి చేరుకున్నారు.
కళియుగ దైవాన్నీ కనులారా వీక్షించ రారండి!