కడప జిల్లా రాయచోటి గాంధీ బజార్లో ఆలయ పైకప్పు కూలి పక్కనే ఉన్న ఇంటిపై పడింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగం చేపట్టిన పనుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హిటాచి సాయంతో శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని కూల్చే సమయంలో శిథిలాలు పొరుగింటిపై పడి...గదిలో ఉన్న ఆరు నెలల చిన్నారి మృతి చెందాడు.
ఇంటిపై కూలిన ఆలయ పైకప్పు...చిన్నారి మృతి
ఆలయ పునర్నిర్మాణ పనుల్లో నిర్వాహకుల నిర్లక్ష్యం ఆరు నెలల చిన్నారి ప్రాణాలు తీసింది. శిథిలావస్థలో ఉన్న ఆలయ భాగాన్ని కూల్చివేస్తున్న సమయంలో శిథిలాలు పక్కనే ఉన్న ఇంటిపై పడ్డాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి శిథిలాల కింద చిక్కుకుని మరణించాడు.
ఈ ఘటనతో గాంధీ బజార్లో విషాదం నెలకొంది. ఆలయ పనులు చేపట్టిన నిర్వహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.ఆలయ కమిటీ సభ్యుల నిర్లక్ష్యం కారణంగానే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయారని బాలుడి తండ్రి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విషయం తెలుసుకున్న రాయచోటి సీఐ చంద్రశేఖర్ ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదం జరగడానికి కారణాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఇవీ చూడండి :మోదీకి గుణపాఠంగా...23న ప్రజాతీర్పు: చంద్రబాబు