పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషికి చంద్రబాబు లేఖ - undefined
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రేపు జరిగే సమావేశానికి రాలేకపోతున్నానని.. పార్లమెంటరీ వ్వవస్థను బలోపేతం చేయాలని లేఖలో సూచించారు.
జమిలి ఎన్నికలపై రేపు జరగనున్న అఖిలపక్ష సమావేశానికి రాలేకపోతున్నానని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా అందరి అభిప్రాయాలు తీసుకోవాలని లేఖలో కోరారు. పార్టీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ అంశంపై చర్చించారు. ఈ మేరకు రాజ్యాంగ, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు.పార్లమెంటరీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సభ నిర్వహణకు ఇటీవల ఆటంకాలు బాగా పెరిగాయన్నారు.వన్ నేషన్-వన్ ఎలక్షన్ నిశితంగా అధ్యయనం చేయాల్సిన అంశంచంద్రబాబు పేర్కొన్నారు. సహకార సమాఖ్య అనేది అత్యంత కీలకమైన అంశమని తెలిపారు. పార్టీలన్నీ కలిసి దేశానికి ఏది మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
TAGGED:
tdp_on_jamili_elections