ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

గెలుపు ఏకపక్షమే: సీఎం చంద్రబాబు

తెలుగుదేశం గెలుపు ఏకపక్షం కావాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దొంగ సర్వేలతో మైండ్‌గేమ్‌ ఆడినా.. కుట్రలు పన్నినా తెదేపా విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.

గెలుపు ఏకపక్షమే: సీఎం చంద్రబాబు

By

Published : Mar 19, 2019, 10:07 AM IST

Updated : Mar 19, 2019, 11:05 AM IST

గెలుపు ఏకపక్షమే: సీఎం చంద్రబాబు
తెలుగుదేశం గెలుపు ఏకపక్షం కావాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు .దొంగ సర్వేలతో మైండ్‌గేమ్‌ ఆడినా..కుట్రలు పన్నినా తెదేపా విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.ప్రజల్లో తెలుగుదేశం పట్ల ఉన్న సానుకూలతతగ్గించ లేరని అన్నారు.విపక్షాలు చేస్తున్న అరాచకాలు చూసి...పౌరుషంతో ఉన్న ప్రజలు...సైకిల్‌ గుర్తుపై ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.వైకాపా నేతలను ఓటమి భయం వెంటాడుతోందని ఎద్దేవా చేశారు.దిక్కుతోచని స్థితిలోనే విపక్షంఎంతటి అక్రమాలకైనా సిద్ధమవుతోందని మండిపడ్డారు.

నేరగాళ్ల ప్రకటన...

వైకాపా అభ్యర్థుల ప్రకటన...నేరగాళ్ల ప్రకటనలా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు.పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్​లో వైకాపా అభ్యర్థుల జాబితాపై ఆయన స్పందించారు.నందిగం సురేష్,ధర్మాన ప్రసాదరావు వంటి నేరగాళ్లకు జగన్ నాయకుడని చంద్రబాబు విమర్శించారు.మైండ్​ గేమ్స్,సైకోగేమ్స్​లో జగన్ దిట్ట అంటూ మండిపడ్డారు.ఎన్నికల్లో సైబర్ నేరగాళ్లు పెరిగిపోయారన్న చంద్రబాబు....వైకాపా వారికి అడ్డాగా మారిందన్నారు.ఎన్నికలు తేదేపాకు ఏకపక్షం అయ్యేలా కృషిచేయాలని కార్యకర్తలకు బాబు సూచించారు.

Last Updated : Mar 19, 2019, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details