ప్రజా ప్రభుత్వాన్ని ఈసీ అడ్డుకోలేదు: సోమిరెడ్డి
ప్రస్తుత ప్రభుత్వం ఆపద్ధర్మం కాదని మంత్రి సోమిరెడ్డి అన్నారు. సమీక్షలు, మంత్రివర్గ సమావేశాలు పెట్టుకునే అధికారం ఉందని మంత్రి తెలిపారు. విమర్శలు చేస్తున్న వైకాపా నేతలు ఎన్నికల నియమావళి చదువుకోవాలని సూచించారు.
ప్రజాప్రభుత్వాన్ని ఈసీ అడ్డుకోలేదు : మంత్రి సోమిరెడ్డి
ప్రకృతి విపత్తుల సమయంలో నిర్ణయాలు తీసుకొనే అధికారం ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వానికి ఉందని మంత్రి సోమిరెడ్డి గుర్తు చేశారు. మంత్రుల సమీక్షలను ఈసీ అడ్డుకోలేదన్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించామన్న మంత్రి సోమిరెడ్డి... ఫొని తుపాను ప్రభావంపై కూడా సమీక్ష నిర్వహిస్తామన్నారు.