ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

నవాజ్​ షరీఫ్​కు బెయిల్

అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​కు లాహోర్​ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది.

నవాజ్​ షరీఫ్​కు బెయిల్

By

Published : Feb 15, 2019, 1:06 AM IST

పాక్​ మాజీ ప్రధాని, పాకిస్థాన్​​ ముస్లిం లీగ్​ నవాజ్​(పీఎంఎల్​-ఎన్​) అధినేత నవాజ్​షరీఫ్​కు లాహోర్​ హైకోర్టులో ఊరట లభించింది. అల్‌ అజీజియా, పనామా పత్రాల కుంభకోణం కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న షరీఫ్​కు బెయిల్​ మంజూరు చేసింది న్యాయస్థానం. షరీఫ్​ అభ్యర్థనను పరిశీలించిన జస్టిస్​ మాలిక్​ షెహజాద్​ అహ్మద్​ నేతృత్వంలోని ధర్మాసనం బెయిల్​ మంజూరుకు అంగీకారం తెలిపింది.

నిజమే గెలిచింది...

లాహోర్​ కోట్​ లఖ్​పేట్​ జైల్​లో శిక్ష అనుభవిస్తున్న షరీఫ్​ బెయిల్​ మంజూరుపై స్పందించారు.

" నిజమే గెలిచింది. రాజకీయ కుట్రతోనే నాపై అక్రమ కేసులు పెట్టారు. నేను ఒక్క రూపాయైనా అక్రమంగా సంపాదించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకంటాను."
- నవాజ్​ షరీఫ్​, పాక్​ మాజీ ప్రధాని

ABOUT THE AUTHOR

...view details