'ముజఫర్పూర్ అత్యాచార కేసు' దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మను ఆ సంస్థ బదిలీ చేయడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. అనుమతి లేకుండా దర్యాప్తు అధికారిని బదిలీ చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడిన అప్పటి సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావును ఫిబ్రవరి 12లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ దీపక్ గుప్త, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 'ముజఫర్పూర్ అత్యాచార కేసు'పై విచారణ చేపట్టింది. తమ ఆదేశాలను ధిక్కరించి ఏకేశర్మను బదిలీచేయటంపై ఎవరెవరి పాత్ర ఉందో ఆ అధికారుల వివరాలు తెలపాలని సీబీఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లాను ఆదేశించింది.