హైదరాబాద్ జూబ్లీహిల్స్లో శివనాగరాజు అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. తెల్లవారు జామున 3గంటలకు ఆఫీస్ బిల్డింగ్ పైనుంచి కిందపడ్డట్టు సీసీ కెమెరాల్లో దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. కానీ అతని ఒంటిపైనున్న కత్తిగాట్లు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి.. ఒంటిపై కత్తిగాట్లు
హైదరాబాద్లో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. సీసీ కెమెరాల్లో బిల్డింగ్పై నుంచి కింద పడ్డట్టు దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. కానీ ఒంటిపైనున్న కత్తిగాట్లు పలు అనుమానాలకు తావిస్తున్నాయి
సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి.. ఒంటిపై కత్తిగాట్లు
శివనాగరాజు పని చేస్తున్న కార్యాలయం లోపల నిన్న రాత్రి 8 గంటల నుంచి సీసీ కెమెరాలు ఆపేశారు. ఎవరు, ఎందుకు ఆపేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పశ్చిమ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఆఫీస్ మేనేజర్, సిబ్బందిని పూర్తిగా విచారించిన తర్వాత ఏం జరిగిందనేది వెల్లడిస్తామన్నారు.