ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'సుప్రీం తీర్పుతో.. ఆదివాసీలు రోడ్డున పడతారు'

అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసీలను ఖాళీ చేయమనడం భావ్యం కాదని ఏపీ రైతు కూలీ సంఘం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 11 లక్షల ఆదివాసీల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై స్పందించి సుప్రీం తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కోరింది.

By

Published : Jun 2, 2019, 1:51 PM IST

రైతు కూలీ సంఘం

రైతు కూలీ సంఘం
2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ ప్రాంతాల్లో పట్టాలు లేకుండా నివసిస్తున్న ఆదివాసీలు ఆ ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును సవరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం కోరుతోంది. ఇవాళ విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు కూలీ సంఘం సహాయ కార్యదర్శి డి.వర్మ మాట్లాడుతూ...ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండా ఆదివాసీలను గిరిజన ప్రాంతాల నుంచి ఖాళీ చేయమనడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుపై కొత్త ప్రభుత్వాలు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. లేకపోతే దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 11 లక్షల మంది గిరిజనుల జీవితాలు అగమ్యగోచరం అవుతాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో జీవనానికి అలవాటుపడిన ఆదివాసీలు మైదాన ప్రాంతాల్లో బతకలేరన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details