ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది: ఆర్టీసీ ఐకాస

ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఐకాస నేతల చర్చలు ముగిశాయి. డిమాండ్ల పరిష్కార దిశగా సమాలోచనలు చేశామని... ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ పలిశెట్టి దామోదర్​ తెలిపారు. సమ్మె విషయమై కార్మిక సంఘాల నేతలతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ముగిసిన ఆర్టీసీ ఐకాస చర్చ

By

Published : Jun 8, 2019, 5:22 PM IST

సచివాలయంలో ఆర్టీసీ ఐకాసతో ఉన్నతాధికారుల చర్చ
ఈనెల 13న సమ్మెకు దిగుతామని నోటీసులిచ్చిన ఆర్టీసీ ఐకాస నేతలతో ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. రవాణశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ టి. కృష్ణబాబు నేతృత్వంలోని ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈయూ సహా 10 సంఘాల ఐకాస నాయకులు డిమాండ్ల పరిష్కార మార్గాలను అధికారులకు వివరించారు. పలు సమస్యలపై సానుకూల సమాలోచనలు చేశామన్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ పలిశెట్టి దామోదర్​... సమ్మెపై కార్మిక సంఘాల నేతలతో సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు హైపవర్ కమిటీ ఏర్పాటుకు అధికారులు హామీఇచ్చారని తెలిపారు.కార్మికుల పదవీవిరమణ వయసు60ఏళ్లకు పెంచే నిర్ణయంపై సానుకూలంగా స్పందించారన్నారు. ఈ నెల10న సీఎం జగన్‌తో సమావేశమై...తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని దామోదర్​ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details