రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. రేపు మధ్యాహ్నం నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. దీక్షితులు మృతికి సంతాపం తెలిపారు. పాత్రికేయుడిగా1967లో మొదలైన దీక్షితులు ప్రస్థానం... 2017 వరకు నిర్విరామంగా కొనసాగింది. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం 2015 నుంచి 2017 వరకు ఆయన రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. జర్నలిజంలో సుదీర్ఘకాలం సేవలందించారు. ప్రస్తుతం ఆయన కుటుంబం తెలంగాణలోని మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలం సైనిక్‌పురిలో దీక్షితులు కుటుంబం నివాసం ఉంటోంది.
రేపు మధ్యాహ్నం వాసుదేవ దీక్షితులు అంత్యక్రియలు - AP PRESS ACADEMY FORMER CHAIRMAN
ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ వాసుదేవ దీక్షితులు అంత్యక్రియలు.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లో జరగనున్నాయి. అనారోగ్యంతో బాధ పడిన ఆయన.. ఇవాళ తుది శ్వాస విడిచారు.
deekshitulu