ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రఫేల్​ ఆరోపణలతో భాజపాకు నష్టంలేదు : గోయల్​ - ఎన్నికలు

రఫేల్​ ఒప్పందంపై ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్న వేళ.. సార్వత్రిక ఎన్నికల్లో దీని ప్రభావంపై చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పీయూష్​ గోయల్​

By

Published : Feb 10, 2019, 6:26 AM IST

Updated : Feb 10, 2019, 9:44 AM IST

రఫేల్​ ఆరోపణలతో భాజపాకు నష్టంలేదు : గోయల్​
రఫేల్​పై ప్రతిపక్షాల నిరాధార ఆరోపణల వల్ల భారతీయ జనతా పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి నష్టం ఉండబోదని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ అన్నారు. 'భారత్​ కే మన్​కీ బాత్​, మోదీ కి సాత్​' పేరిట మేనిఫెస్టో రూపకల్పనపై నెల రోజు వ్యవధిలో ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించే కార్యక్రమాన్ని ముంబయిలో ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకు ఆపార విశ్వాసం ఉందని, అందుకే ప్రజలెవరూ ఆయనపై ప్రశ్నలను లేవనెత్తట్లేదన్నారు. ప్రతిపక్షాలు రఫేల్​కే పరిమితమయ్యాయని, భాజపా మాత్రం అభివృద్ధిపై దృష్టి సారించిందని వ్యాఖ్యానించారు పీయూష్​.

Last Updated : Feb 10, 2019, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details