ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'ఓట్లు సాధించడానికి కోట్లు అవసరం లేదు' - పవన్ కల్యాణ్

నోట్ల రాజకీయాలు మానుకొని ఓట్ల రాజకీయాలు చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆ ఉద్దేశంతోనే జనసేన సామాన్యులకే టికెట్లు ఇచ్చిందని తెలిపారు. నిబద్ధతే ప్రామాణికంగా టికెట్లు కేటాయించామన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

By

Published : Mar 22, 2019, 6:38 AM IST

Updated : Mar 22, 2019, 9:36 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో ముఖాముఖి
ఎన్నికల్లో గెలవాలంటే వందల కోట్లు అవసరం లేదని జనసేన నిరూపించబోతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. నోట్లు అవసరం లేని సరికొత్త రాజకీయానికి తాము నాంది పలుకుతున్నామని అన్నారు . డబ్బున్న వాళ్ళకే ఎన్నికలు అనే అభిప్రాయాలను చెరిపేయడానికి సామాన్యులనే జనసైనికులుగా ఎన్నికల రణ రంగంలోకి దించుతున్నామని తెలిపారు . ప్రజాసేవ చేయాలన్న తపన.. నిబద్ధతే ప్రామాణికంగా... ఎన్నికల్లో టికెట్లను కేటాయించామన్నారు.
Last Updated : Mar 22, 2019, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details