కేసీఆర్ తో జగన్ దోస్తీ విడ్డూరం: మాగంటిబాబు వైకాపా అధినేతజగన్, తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ మధ్య ఉన్నముసుగు తొలగిపోయిందని తెదెపా ఎంపీ మాగంటిబాబు అన్నారు. ఆంధ్రరాష్ట్రాన్ని అధోగతి పాలుచేయడానికి.. పన్నాగాలు పన్నుతున్న కేసీఆర్ తో జగన్ దోస్తీ చేయడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్న కేసీఆర్ తో జగన్ కలసి పనిచేయడం వెనుక కుట్రలు దాగున్నాయని ఆరోపించారు. ప్రజలు ఈ బంధాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. పోలవరం నిర్మాణం ఆపడం కోసం కేసీఆర్ విశ్వప్రయత్నం చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి కుట్రలు చేస్తుంటే.. జగన్ పాత్రధారిగా మారారని విమర్శించారు.