సచివాలయ ప్రాంగణంలో ఇవాళ ఉదయం రాష్ట్ర నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ఈ బృందంలో విద్యావంతులు చాలా మందే ఉన్నారు. పదో తరగని నుంచి పీహెచ్‌డీ చేసిన వారు సహా.. మంత్రులయ్యారు. మొత్తంగా చూస్తే... పదో తరగతి వరకు మాత్రమే చదివిన వారు ముగ్గురు, ఇంటర్ వరకు పూర్తి చేసిన వారు మరో ముగ్గురు, పీజీలు చేసిన వారు ఇంకో ముగ్గురు, పీహెచ్‌డీ చదివిన వారు ఇద్దరు ఉన్నారు.
పదో తరగతి వరకు మాత్రమే చదివినవారు:
మంత్రి పేరు | విద్యార్హత | నియోజకవర్గం | జిల్లా |
గుమ్మనూరు జయరాం | పదో తరగతి | ఆలూరు | కర్నూలు |
వెల్లంపల్లి శ్రీనివాస్ | పదోతరగతి | విజయవాడ పశ్చిమ | కృష్ణా |
కొడాలి నాని | పదో తరగతి | గుడివాడ | కృష్ణా |
ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివిన వారు:
మంత్రి పేరు | విద్యార్హత | నియోజకవర్గం | జిల్లా |
బాలినేని శ్రీనివాస్ రెడ్డి | ఇంటర్ | ఒంగోలు | ప్రకాశం |
చెరుకువాడ శ్రీరంగనాథ రాజు | ఇంటర్ | ఆచంట | పశ్చిమ గోదావరి |
అవంతి శ్రీనివాస్(ముత్తం శెట్టి శ్రీనివాసరావు) | ఇంటర్ | భీమిలి | విశాఖపట్నం |
డిగ్రీ చేసిన వారు 14:
మంత్రి పేరు | విద్యార్హత | నియోజకవర్గం | జిల్లా |
ధర్నాన కృష్ణ దాస్ | బీకాం | నరసన్నపేట | శ్రీకాకుళం |
బొత్స సత్యనారాయణ | బీఏ | చీపురుపల్లి | విజయనగరం |
పాముల పుష్ప శ్రీవాణి | బీఎస్సీ | కురుపాం | విజయనగరం |
పిల్లి సుబాష్ చంద్రబోస్ | బీఎస్సీ | మండపేట | తూర్పుగోదావరి |
పినిపె విశ్వరూప్ | బీఎస్సీ, బీఈడీ | అమలాపురం | తూర్పుగోదావరి |
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) | బీకాం | ఏలూరు | పశ్చిమ గోదావరి |
పేర్ని వెంకట్రామయ్య(నాని) | బీకాం | మచిలీపట్నం | కృష్ణా |
మేకతోటి శ్రీచరిత | బీఏ | ప్రత్తిపాడు | గుంటూరు |
మోపిదేవి వెంకటరమణ | బీకాం | రేపల్లె | గుంటూరు |
అనిల్ కుమార్ యాదవ్ | బీడీఎస్(బ్యాచిలర్ ఆఫ్ డెంటర్ సర్వీస్) | నెల్లూరు సిటీ | నెల్లూరు |
యం. శంకర్ నారాయణ | బీకాం,ఎల్ఎల్బీ | పెనుకొండ | అనంతపురం |
కె. నారాయణ స్వామి | బీఎస్సీ | గంగాధర నెల్లూరు | చిత్తూరు |
అంజాద్ బాషా | బీఏ | కడప | కడప |
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి | బీఈ | డోన్ | కర్నూలు |
పీజీ వరకు చదవిన వారు ముగ్గురు:
మంత్రి | విద్యార్హత | నియోజకవర్గం | జిల్లా |
కురుసాల కన్నబాబు | బీకాం, ఎంఏ | కాకినాడ రూరల్ | తూర్పుగోదావరి |
తానేటి వనిత | ఎమ్మెస్సీ | కొవ్వూరు | పశ్చిమ గోదావరి |
మేకపాటి గౌతమ్ రెడ్డి | ఎమ్మెస్సీ(టెక్స్టైల్స్) | ఆత్మకూరు | నెల్లూరు |
ఉన్నత చదువులు వీరివే:
మంత్రి | విద్యార్హత | నియోజకవర్గం | జిల్లా |
పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి | ఎంఏ, పీహెచ్‌డీ(సోషియాలజీ) | పుంగనూరు | చిత్తూరు |
ఆదిమూలపు సురేశ్ | బీఈ, ఎంటెక్, పీహెచ్‌డీ | యర్రగొండపాలెం | ప్రకాశం |
మొత్తంగా మంత్రుల్లో బీకాం చేసిన వారు అధికంగా ఉన్నారు. వీరిలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ ఐఆర్ఎస్లో విధులు నిర్వహించి అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు.