వివాహిత మృతి..భర్తింటి వారే చంపారని బాధితుల ఆరోపణ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో అనుమానాస్పదంగా ఓ వివాహిత చనిపోయింది. ఆమె మృతదేహం బావిలో తేలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదనపు కట్నం కోసం అత్తమామలు వేధించేవారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెది హత్య అని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏడాది క్రితమే వివాహం.. అంతలోనే దారుణం
జిల్లాలోని రేణిగుంట మండలం వినాయకనగర్ చెందిన జయలక్ష్మి రమేష్ దంపతుల పెద్ద కుమార్తె అయిన రమ్యను పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లోని ఈశ్వర్‌కు ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేశారు. ఇంతలోనే ఈ ఘటన జరగడంపై కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమార్తెను చంపినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రామాంజనేయులు, తహశీల్దార్ విజయభాస్కర్ పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రుల నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టానికి పంపారు.
ఇదీ చదవండి :బుల్లితెర నటి అదృశ్యం... అనుమానం ఎవరి మీదంటే..?