ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'పెళ్లి ఫొటో కొట్టాడు...జాతీయ అవార్డు పట్టాడు' - విశాఖ

పెళ్లిజంట ఫొటో జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. విశాఖ కుర్రాడు తీసిన ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చుక్కలు కదులుతున్నాయా అన్నట్లు తీసిన ఈ చిత్రాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఫొటోగ్రాఫర్ గౌతం అగర్వాల్

By

Published : Mar 22, 2019, 6:17 AM IST

Updated : Mar 22, 2019, 6:25 AM IST

వినూత్నంగా తీసిన ఓ పెళ్లి ఫొటో జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. విశాఖకు చెందిన ఫొటోగ్రాఫర్ గౌతం అగర్వాల్ వివాహ ఫొటోలు చిత్రీకరణ అభిరుచి. ఆ అభిరుచితో ఓ పెళ్లి జంటకు విశాఖలో చారిత్రక ప్రదేశమైన తొట్లకొండ స్థూపం వద్ద ఓ ఫొటో తీశారు. చీకటిలో తీసిన ఆ ఫొటో ఆకాశంలో చుక్కలు ప్రయాణిస్తాయా...అనేలా ఓ పెయింటింగ్ అనుభూతి కల్గించేలా ఉంది. ప్రస్తుతం ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోకు బెటర్ ఫొటోగ్రఫీ అనే పత్రిక నిర్వహించిన పోటీల్లో ప్రథమస్థానం లభించింది.

ఫొటోగ్రాఫర్ గౌతం అగర్వాల్
Last Updated : Mar 22, 2019, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details