శారదా చిట్ కుంభకోణం కేసులో కోల్కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ. షిల్లాంగ్లో జరుగుతోన్న విచారణ అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. స్వయంగా ఓ సీబీఐ అధికారే ఈ విషయం వెల్లడించారు.
ఉదయం 11 గంటలకు షిల్లాంగ్ ఓక్లాండ్ సీబీఐ కార్యాలయంలో ప్రశ్నల మారథాన్ ప్రారంభమయింది. సుప్రీం మార్గదర్శకాలను అనుసరించి విచారణ జరుపుతున్నామని అధికారులు పేర్కొన్నారు.