తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ-ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఖమ్మం వైపు వస్తున్న ఆటోని ఎదురుగా వస్తున్న సిమెంటు లోడు లారీ ఢీకొంది. ఘటనలో ఐదుగురు మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులందరూ కోదాడలోని ఓ అపార్టుమెంటుకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ్మరలో శ్రీరామ నవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పరామర్శించిన ఎమ్మెల్యే...