సత్తెనపల్లి తాలూకా సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్.. ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం.. అవినీతిలో అగ్రస్థానానికి చేరిందని ఆరోపించారు. సత్తెనపల్లిలో సభాపతి కోడెల, ఆయన కుమారుడు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తెదేపా ప్రభుత్వంలో కప్పం కట్టకపోతే ఒక్క పని జరగదని విమర్శించారు. నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాలని కోరారు.
అభివృద్ధిలో కాదు.. అవినీతిలోనే తెదేపా అగ్రస్థానం: జగన్ - ఏపీ సార్వత్రిక ఎన్నికలు 2019
చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధిలో కాదు... అవినీతిలో అగ్రస్థానం సాధించిందని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. వైకాపా వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని హామీ ఇచ్చారు.
సత్తెనపల్లి ప్రచారంలో వైఎస్ జగన్
ఇవీ చూడండి :''మాయావతే ప్రధాని... పవనే ముఖ్యమంత్రి''