పదవీ విరమణ తర్వాత బెనిఫిట్స్ కోసం నగదు చెల్లిస్తూ వచ్చినా... పాత బకాయిల పేరుతో యాజమాన్యం నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కడప జిల్లా మైదుకూరులో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేశారు. అవుట్ సోర్సింగ్ పేరుతో గ్యారేజీలో కార్మికులను తగ్గిస్తూ పని భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులపై ఒత్తిడి పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. డిజిటల్ వ్యవస్థను ఉపయోగిస్తూ చార్టులను బలవంతంగా రుద్దుతున్నారని, ఆ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని కోరారు. సీసీఎస్, పిఎఫ్, ఎస్బిటి, ఎస్ఆర్బిఎస్ పేరుతో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు జమచేసినప్పటికీ... ఎలాంటి రుణాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనివల్ల పిల్లలకు ఫీజు కూడా కట్టలేకపోతున్నామని వాపోయారు. యాజమాన్యం వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
'ఆర్టీసీ యాజమాన్యం... వైఖరి మార్చుకోవాలి' - కార్మికుల ఆందోళన
ఆర్టీసీ యాజమాన్య పదవీ విరమణ కార్మికులను చిన్నచూపు చూస్తోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. యాజమాన్యం వైఖరి మార్చుకోవాలని కోరారు.
యాజమాన్యం మొండి వైఖరిపై కార్మికుల ఆందోళన