మరో రెండు వారాల్లో ఐఐటి విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి ఐఐటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏర్పేడు సమీప ఐఐటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో మైదానాలు నిర్మించారు. విద్యార్థుల వ్యాయామానికి జిమ్లో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. నూతన సాంకేతిక విధానాలతో వసతి గృహాలు, ల్యాబ్లు, తరగతి గదులను నిర్మించారు. విశాలమైన క్యాంటీన్, అన్ని వసతులతో ఉన్న లైబ్రరీ, హెల్త్ కేర్ సెంటర్ సిద్ధం చేశారు. దీంతో ఏర్పేడులోని తిరుపతి ఐఐటి కొత్త విద్యార్థులకు ఆహ్వానం పలుకుతుంది.
సర్వాంగ సుందరంగా ఐఐటి విద్యా ప్రాంగణం - iit yerpedu
తిరుపతి ఐఐటిలో మరో రెండు వారాల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు అద్దె ప్రాంగణాల్లో నడిపిన యాజమాన్యం... ఈ సంవత్సరం ఐఐటీలో తరగతులు ప్రారంభిస్తున్నారు.
సర్వాంగ సుందరంగా ఐఐటి విద్యా ప్రాంగణం