గుంటూరు జిల్లా కారంపూడి శివారులో ఉన్న ఓ హోటల్ కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. రాజకీయకక్షల కారణంతో ఓ పార్టీ కార్యకర్తలు హోటల్ కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈరోజు ప్రొక్లెయిన్ సాయంతో హోటల్ కూల్చివేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. కూల్చివేతను అడ్డుకోడానికి ప్రయత్నించిన హోటల్ యజమాని షేక్ రషీద్, అతని కుటుంబ సభ్యులపై దాడి చేశారని గ్రామస్థులు అంటున్నారు. ఘటనపై బాధితుడు రషీద్ కారంపూడి పోలీసుల్ని ఆశ్రయించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కారంపూడి శివారులో హోటల్ కూల్చివేత.. ఉద్రిక్తం
పాత కక్షల కారణంతో కారంపూడి శివారులో ఉన్న ఓ హోటల్‌ను ఇవాళ కొందరు వ్యక్తులు కూల్చివేశారు. కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తనపై దాడి చేశారని హోటల్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాతకక్షలతో దాబా కూల్చివేత