జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భారత భద్రత బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. జిల్లాలోని కెల్లెం గ్రామంలో ముష్కరులు నక్కినట్టు వచ్చిన సమాచారం మేరకు జవాన్లు తనిఖీలు చేప్టటారు. తనిఖీలు చేస్తున్న వారిపై తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైనికులు వారికి దీటుగా జవాబిచ్చారు.
కుల్గాంలో ఐదుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రత బలగాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్
సైనికులు, ఉగ్రవాదులకు మధ్య చాలా సేపు కాల్పులు కొనసాగాయి. కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. వారు ఏ ఉగ్రవాద సంస్థలకు చెందినవారనే సమాచారం తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.