కర్నూలు జిల్లా డోన్ మండలం మల్లెంపల్లి గ్రామంలో ఒకే పార్టీకి చెందిన 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పొలం గట్టు విషయంలో ఇరువురుకి తగాదా జరిగింది. ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకరికి ఒకరు కట్టలతో విసురుకొని గ్రామంలో ఒక అలజడి సృష్టించారు. ఈ ఘర్షణ చూసి గ్రామంలో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామంలోకి పోలీసులు చేరుకుని సమస్య పరిష్కరించారు. ఘటనపై కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల ఘర్షణ
ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు కర్నూలు జిల్లా మల్లెంపల్లి గ్రామంలో ఘర్షణ పడ్డారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల ఘర్షణ