అనంతపురం జిల్లాలో జరుగుతున్న వేరుశెనగ విత్తన పంపిణీ కేంద్రాల వద్ద కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాయదుర్గం, గుమ్మఘట్ట మండల పంపిణీ కేంద్రాల వద్ద పరిస్థితి తీవ్రంగా ఉంది. వరుస కరవుల కారణంగా రైతుల వద్ద విత్తనం లేక సబ్సిడీ వేరుశెనగ విత్తనాలకై కేంద్రాలకు వచ్చారు. షామియానాలు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక సొమ్మసిల్లిపోయారు. సర్వర్లు మొరాయించడంతో గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయదుర్గంలో ఓ వృద్ధురాలు ఎండవేడిమి తట్టుకోలేక స్పృహ కోల్పోయింది. హుటాహుటిన సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు.
విత్తన పంపిణీ కేంద్రాల వద్ద రైతులు ఇక్కట్లు - rayadurgam
అనంతపురం జిల్లా రాయదుర్గం, గుమ్మఘట్ట కేంద్రాల వద్ద రైతులు ఇబ్బంది పడ్డారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాలకై కేంద్రాలకు వచ్చిన వారికి అధికారులు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేకపోయారు. దీనికితోడు సర్వర్లు పని చేయకపోవడంతో రైతులు క్యూలైన్లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చింది.
విత్తన పంపిణీ కేంద్రాల వద్ద రైతులు ఇక్కట్లు