ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పర్యావరణహితాన్ని 'వెదురు' వెళ్లి స్వాగతం పలుకుదాం...

రాష్ట్రంలో 335 కోట్లతో అటవీకరణ వార్షిక ప్రణాళిక చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. వెదురుతో తయారు చేసిన వస్తువులను  ప్రోత్సాహించాలని సూచించారు. పునరావాస ప్రాంతాల్లో వెదురు పెంపకం చేపట్టి.. పర్యాటక ప్రదేశాల్లో వెదురు ప్లాజాలు ఏర్పాటుకు ఆదేశించారు.

By

Published : Jul 4, 2019, 7:04 AM IST

cs review

వెదురుకు ప్రోత్సాహం

సచివాలయంలో రాష్ట్ర కంపెన్సేటరి అఫారెస్టరెషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్లాన్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ బయో డైవర్సిటీ సోసైటీ 13వ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం...2019-20లో వార్షిక అటవీ సంరక్షణ కార్యక్రమం కింద 335 కోట్లతో అడవుల పెంపకం చేపట్టే చర్యలు వెల్లడించారు. వెదురు పెంచి... ఉత్పత్తుల ప్రోత్సాహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో ఈ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను ఉటంకించారు.

పర్యాటక ప్రాంతాల్లో వెదురు ప్లాజాలు

పోలవరం సహా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాల్లో వెదురు పెంపకం చేపట్టేందుకు ఆదేశించారు. గిరిజనుల భాగస్వామ్యంతో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు కన్వర్జెన్స్‌తో వెదురు పెంపకం చేపట్టాలన్నారు. మైదాన ప్రాంతాల్లోనూ ఈ పని చేయాలన్నారు. విజయవాడ భవానీ ద్వీపం, విమానాశ్రయంసహా ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో వెదురు ప్లాజా ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. పర్యాటక శాఖను భాగాస్వామ్యంతో చర్యలు తీసుకోవాలన్నారు.

వెదురు ఉత్పత్తుల తయారీకి ప్రత్యేక శిక్షణ
నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సహాయం శిక్షణ ఇవ్వాలన్నారు. షాపింగ్ మాల్స్‌లోనూ వెదురు ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా ప్రోత్సహించాలని సూచించారు. రాజమహేంద్రవరంలో 12 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఫారెస్టు డెవలప్ మెంట్ అకాడమీలో పూర్తిగా వెదురు వస్తువులు వినియోగించాలని సూచించారు. వెదురును పెంచే సంఘాలను స్థానిక ప్రజల భాగాస్వామ్యంతో వెదురు ఉత్పత్తుల తయారీ ప్రోత్సాహానికి కృషి చేయాలని అటవీశాఖను ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details