ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జాగ్రత్త.. 'సోషల్'​గా శృతి మించకండి!

​​​​​​​క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నారు. వారికి మద్దతు ఇచ్చే శ్రేణులు కూడా సామాజిక మాధ్యమాల్లో అంతకు మించి అన్నట్టు పోస్టింగ్ లు పెడుతూ ప్రత్యర్థులను ఇరుకున పెడుతున్నారు. ఇది శ్రుతి మించిదే సహించేది లేదని హెచ్చరిస్తోంది ఎన్నికల సంఘం.

By

Published : Mar 20, 2019, 12:04 PM IST

Updated : Mar 20, 2019, 12:51 PM IST

మరీ సోషల్ అవ్వొద్దు : ద్వివేది

మరీ సోషల్ అవ్వొద్దు : ద్వివేది
క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నారు. అంతకుమించిఅన్నట్టు... వారికి మద్దతు ఇచ్చే శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ లు పెడుతూ ప్రత్యర్థులను ఇరుకున పెడుతున్నారు. ఇది శ్రుతి మించితే సహించేది లేదని హెచ్చరిస్తోంది ఎన్నికల సంఘం. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టింగ్ లు, వైరల్ అవుతున్న వీడియోలపై నిరంతర నిఘా పెట్టామని స్పష్టం చేసింది. హద్దు దాటితే కఠిన చర్యలు తప్పవని... జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లకు సూచిస్తున్నారు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది.

''మీడియా వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకుపర్యవేక్షకకమిటీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.కోడ్ ఉల్లంఘనను నిశితంగా పరిశీలిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలనునిశితంగా పరిశీలిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి చర్యకు పాల్పడినా... కఠిన చర్యలకు సిద్ధమైమైంది.అవసరమైతేసుమోటోగా కేసులు నమోదు చేసేందుకు నిర్ణయించింది'' - గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్రఎన్నికల ప్రధానాధికారి

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన సందర్భాల్లో..ఇప్పటివరకు రాజకీయపార్టీలకు 89 నోటీసులు జారీ చేఅయినట్టు ద్వివేదిచెప్పారు. తెలుగుదేశానికి 48, వైకాపాకు 30, జనసేనకి 11 నోటీసులు పంపామని తెలిపారు. సోషల్‌ మీడియా ఐపీసీ సెక్షన్ 153 ఏ అతిక్రమిస్తే మూడేళ్ళ జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు కోడ్ ఉల్లంఘించకుండా సహకరించాలని కోరారు. నామినేషన్లు ప్రారంభమైన తొలిరోజు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు వచ్చాయని... లోక్​సభ స్థానాలకు ఒక్క నామినేషన్ దాఖలు కాలేదని తెలిపారు. ఈ నెల 25 నుంచి అభ్యర్ధుల వారీగా పరిశీలన ఉంటుందని చెప్పారు. 23, 24 సెలవుల కారణంగా.. ఆ రెండురోజుల్లో నామినేషన్లు స్వీకరించమని పేర్కొన్నారు.

16 కోట్లు నగదు స్వాధీనం

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక... రాష్ట్రంలో ఇప్పటి వరకూ 16 కోట్ల రూపాయల నగదు సీజ్ చేశామని ద్వివేది చెప్పారు. ''చిత్తూరులో 6 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం.. వెండిని స్వాధీనం చేసుకున్నాం.నామినేషన్లకు ముందే ఎక్సైజ్ శాఖ 7కోట్ల 35 లక్షల విలువచేసే అక్రమమద్యాన్ని సీజ్ చేసింది. ఇప్పటి వరకు వివిధ అంశాలపై అందిన ఫిర్యాదుల్లో 79 శాతం చర్యలు తీసుకుని.. దేశంలోనే మొదటిస్థానంలో నిలిచాం. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం'' అని ద్వివేది చెప్పారు.

లక్ష 55 వేల 99 ఓట్లు తొలగింపు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్పిన ప్రకారం... రాష్ట్రంలోని 170 నియోజకవర్గాల్లో ఒక లక్ష 55 వేల 99 ఓట్లు తొలగింపునకు గురయ్యాయి.10 లక్షల 62వేల 441 ఫారం 6 దరఖాస్తులు ఇంకాపెండింగ్ లోఉన్నాయి. ఈ నెల 25 లోపు ఫారం 6 పరిశీలన పూర్తిచేసి.. తుది జాబితానుప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3 కోట్ల 93 లక్షలకు చేరే అవకాశం ఉంది.

ఫిర్యాదులు అందాయి..

డీజీపీని మార్చాలనే ఫిర్యాదులు కూడా అందాయని.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ద్వివేది చెప్పారు. అధికారులు ఎన్నికల నిబంధనలు ఉల్లంగిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి....

'ఆధునిక హంగులతో చంద్రబాబు రథం'

Last Updated : Mar 20, 2019, 12:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details