ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జవాన్లపై వైకాపా దాడి అమానుషం: దేవినేని

సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లపై వైకాపా కార్యకర్తల దాడి అమానుషమని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. సీఎం పదవి కోసం జగన్ ఎంతటి దారుణానికైనా సిద్ధపడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

DEVINENI

By

Published : Apr 4, 2019, 9:47 AM IST

సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లపై వైకాపా దాడి అమానుషం: దేవినేని
వైకాపా నేతల అరాచకాలు రోజురోజుకూపెరుగుతున్నాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లపై వైకాపా కార్యకర్తల దాడి అమానుషమన్నారు.ఓడిపోతామనే భయంతోనే వైకాపా కార్యకర్తల దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.జగన్‌ రెచ్చగొట్టే ప్రసంగాలతో దాడులకు పాల్పడుతున్నారన్నారు.మైలవరం చరిత్రలోనే ఎప్పుడూ లేని ఆరాచకాన్ని జగన్ సృష్టించారన్నారు.పోలీసులు,అధికారులు సూచించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో కావాలనే జగన్‌ వచ్చారని తెలిపారు.పులివెందులకు నీరు ఇచ్చామనే కక్షతోనే నిన్న మైలవరం వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టి వెళ్లారన్నారు.ఒకరోజు ప్రచారానికి విరామమిచ్చి...పసుపు-కుంకుమ డబ్బులు మహిళలకు అందకూడదని కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు.ప్రజాస్వామ్యంపై జరిగిన దాడికి జగన్‌ సమాధానం చెప్పాలని మంత్రి దేవినేని అన్నారు.ఇప్పుడే ఇలా ఉంటే వైకాపా అధికారంలోకి వస్తే పరిస్థితేంటని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి....

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details