మంత్రుల ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సమీక్ష
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, సీఆర్‌డీఏ కమిషనర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సచివాలయం పార్కింగ్ ఏరియాలో ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ డీజీ, సీఆర్‌డీఏ కమిషనర్ పి.లక్ష్మీ నృసింహం హాజరయ్యారు. సచివాలయం పార్కింగ్ ఏరియాలో ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎం కార్యాలయ పనులను వైకాపా నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పరిశీలించారు. జూన్ 8న ఉదయం 8.30 గంటలకు సీఎం తన ఛాంబర్‌లో అడుగుపెట్టనున్నారు.