ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

వైకాపా నేర రాజకీయాలను ప్రజలంతా ఖండించాలి: చంద్రబాబు - వైకాపా

గెలుపు కోసం వైకాపా నేరాలు-ఘోరాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వైకాపా హత్యా రాజకీయాలను ప్రజలంతా ఖండించాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబునాయుడు

By

Published : Apr 11, 2019, 1:16 PM IST

తాడిపత్రిలో తెదేపా నేత సిద్దా భాస్కరరెడ్డి, సత్తెనపల్లిలో కోడెలపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. రాప్తాడులో వైకాపా దౌర్జన్యాలకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలుపు కోసం వైకాపా నేరాలు-ఘోరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓటర్లను పోలింగ్​కు రాకుండా చేయాలనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా హత్యా రాజకీయాలను ప్రజలంతా నిరసించాలని పిలుపునిచ్చారు. ఓటమి భయంతోనే వైకాపా హత్యలు, హింస, విధ్వంసాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. భాజపా, తెరాస మద్దతుతోనే వైకాపా పేట్రేగిపోతోందని దుయ్యబట్టారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సింది ఓటర్లేనన్నారు. ప్రజలంతా ధైర్యంగా ఓటు వేయడం ద్వారా వీళ్లకు బుద్ది చెప్పాలని కోరారు. ఈ ఎన్నిక రాష్ట్రంలో శాంతిస్థాపనకు నాంది కావాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details