ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పదేళ్లలో ఏపీనే దేశంలో నెంబర్‌వన్‌: చంద్రబాబు - vinukonda

50 వేల కోట్ల రూపాయలతో అమరావతిని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పింఛను డబ్బులు దాచుకుని మరీ కనిగిరికి చెందిన ఓ వృద్ధురాలు రాజధానికి 50 వేలు ఇచ్చిందన్న సీఎం...ఆంధ్రావాళ్ల దెబ్బ, తెలివితేటలు మోదీకి రుచి చూపిస్తానన్నారు...

సీఎం చంద్రబాబు

By

Published : Apr 3, 2019, 10:06 PM IST

సీఎం చంద్రబాబు
గుంటూరు జిల్లా వినుకొండ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు... రాష్ట్రంలో కరవు అనే మాటే వినబడకూడదన్నారు.అమరావతి అభివృద్ధి కాకూడదనిమోదీఅనుకున్నారని...అందుకేమట్టి, నీళ్లు తప్ప ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. ఐదేళ్ల పాటు రాష్ట్రం కోసం కష్టపడ్డానన్న బాబు..కేసీఆర్‌ లక్ష కోట్లు ఇవ్వాలన్నారు. నరేంద్రమోదీ నమ్మించి మోసం చేశారన్న సీఎం.. అవనిగడ్డలోరాజ్‌నాథ్‌సింగ్‌ సభకు వందమంది రాలేదన్నారు. పోలవరానికి ఇవ్వాల్సిన రూ.4,500 కోట్లు ఎందుకివ్వరని ప్రశ్నించారు.

పోలవరం కడితే భద్రాచలం మునుగుతుందని కేసీఆర్ అంటున్నారన్న సీఎం...గట్టిగా మాట్లాడితే భద్రాచలం కూడా మనదేనన్నారు. జాబు కావాలంటే మళ్లీ మళ్లీ బాబే రావాలని పిలుపునిచ్చిన బాబు... కోడికత్తి పార్టీ వస్తే ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. సినిమా నటుడు పవన్‌ అత్తారింటికి, జగన్‌ జైలుకు దారి చూపిస్తారని ఎద్దేవా చేశారు. ఎవరు కావాలో మీరే తేల్చుకోవాలని హితవు పలికారు. సామాజిక న్యాయమే నా సిద్ధాంతమన్న సీఎం... వచ్చే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దేశంలో నెంబర్‌వన్‌ అవుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details