హైదరాబాద్ బోయిన్పల్లి హస్మత్పేట్లో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని టిప్పర్ రూపంలో మృత్యువు బలి తీసుకుంది.
చిన్నారి నిండు ప్రాణం తీసిన టిప్పర్
తెలంగాణలోని హైదరాబాద్ హస్మత్పల్లిలో విషాదం చోటు చేసుకొంది. టిప్పర్ బ్రేకులు విఫలమై.. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి నిండు ప్రాణాన్ని చక్రాలతో తొక్కేసింది.
చిన్నారి నిండు ప్రాణం తీసిన టిప్పర్
హస్మత్పేట్లో కంకరతో వెళ్తున్న టిప్పర్ బ్రేక్లు విఫలమై.. ఒక్కసారిగా వెనక్కి వచ్చింది. అక్కడే ఆడుకుంటున్న చిన్నారిపైనుంచి దూసుకొచ్చింది. టిప్పర్ వెనుకనే ఉన్న టాటా ఏసీ వాహనాన్ని, విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని ఆగిపోయింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.